👉 గౌరవ హై కోర్టు ఇచ్చిన తీర్పును మేము గౌరవిస్తూ స్వాగతిస్తున్నాం !
👉 ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ .!
J.SURENDER KUMAR,
ఎమ్మెల్యే లపైన అనర్హత వేటు పిటిషన్ పై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై మాజీ మంత్రి హరీష్ రావు మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ఈ సంధర్బంగా సోమవారం ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కుమార్ మాట్లాడుతూ..
మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రస్తుత డిప్యూటీ సీఎం నాటి కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ భట్టి విక్రమార్క నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మీరు కుట్ర పూరితంగా బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకొని ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలనుకున్నది వాస్తవం కాదా ? అప్పుడు మీరు అవలంబించిన విధానాలు, పద్ధతులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను విమర్శించే విధంగా లేవా ? అని లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి ఏ విధంగా తమ పార్టీలోకి తీసుకున్నారో రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు అని అన్నారు.
గౌరవ హై కోర్టు ఇచ్చిన తీర్పును మేము గౌరవిస్తూ స్వాగతిస్తున్నామని, రాష్ట్ర ప్రజలు మీ పాలనకు సమాధి కట్టి మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించారని లక్ష్మణ్ కుమార్ అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన బుదర జల్లే విధమైన వైఖరి తప్ప ప్రజలకు మేలు చేసే విధంగా ఏమి లేవని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు.