మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపణలు అవాస్తవం !

👉 త్వరలోనే ధర్మపురిలో మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తాం

👉 ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదివారం మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలు ,  అనేక అంశాల సత్యదూరమైన ఆరోపణలు, అవాస్తమని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఖండించారు.
ధర్మపురిలోని ఎమ్మెల్యే  క్యాంపు కార్యాలయంలో సోమవారం  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు


👉 మీడియా సమావేశంలో ప్రధాన పాయింట్స్..


👉 కొప్పుల ఈశ్వర్ మంత్రిగా ఉన్న సమయంలో ధర్మపురిలోని ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన ICU యూనిట్ కి సంబంధించిన వైద్య పరికరాలను గదిలో పెట్టీ తాళం వేశారు.

👉 బి.ఆర్.ఎస్ ప్రభుత్వంలో కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీ లో చేర్చకుండా ప్రజలను గాలికి వదిలేశారు.మన ప్రాంతానికి చెందిన ఎంతమంది కరోనా బాధితులను కొప్పుల ఈశ్వర్ ఆదుకున్నాడు ? ఎందుకు మాత శిశు ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులో తీసుకురాలేదు ?

👉 జ్వరాలు ప్రబలకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు,సిఎం  వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

👉 మన ప్రాంతానికి చెందిన ఎంతో మంది ప్రజలు కరోనా బారిన పడి వైద్యం కోసం హైదరాబాద్ వెళ్తే ఆసుపత్రులలో బెడ్స్ దొరకని పరిస్థితి ఉండేది, మన ప్రాంతానికి చెందిన ఎంతమంది కరోనా బాధితులను ఆదుకున్నారో కొప్పుల ఈశ్వర్ చెప్పగలడా ?

👉 జ్వరాలు ప్రబలకుండా అధికారులు,గ్రామ గ్రామాన అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు నివేదికలను ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. నేనే స్వయంగా ధర్మపురి లోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి సమస్యలు తెలుసుకున్నాను అన్నారు.

👉 మీలాగ కరోనా వస్తే ప్రజలను గాలికి వదిలేయలేదు, ధర్మపురిలో మాత శిశు ఆసుపత్రి పనులు 80% పూర్తి చేసి 20% పనులు పెండింగ్ లో ఎందుకు  ఉన్నాయి ?  అట్టి ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులో తీసుకురాలేదు ?

👉 రాష్ట్ర ఖజనాను మొత్తం ఖాళీ చేసి రాష్ట్రాన్ని మాకు అప్పగించినప్పటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

👉 జిల్లా కలెక్టర్ తో మాట్లాడి త్వరలోనే ధర్మపురిలో మెగా హెల్త్ క్యాంపును ఏర్పాటు చేస్తాం, గతంలో సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నావు  ఎందుకు పెద్దపూర్ సంక్షేమ హాస్టల్ కి వెళ్ళలేదు.?

👉 సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి తరహాలో ఎందుకు ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేయలేకపోయారు ?

👉 కడెం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అనే సమాచారం మేరకు , ఇరిగేషన్ మంత్రి తో మాట్లాడి ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఓపెన్ చేయించి ఈ ప్రాంతానికి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టామన్నారు.

👉 రాష్ట్ర ముఖ్యమంత్రి  ఖమ్మం వరదల్లో నష్టపోయి ఆస్తినష్టం వాటిల్లిన ప్రతి ఒక్కరికీ ₹ 17,500 రూపాయల నష్ట పరిహారం ప్రకటించారు.

👉 వర్ష కాలం కాబట్టి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరమైన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం..
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.