J.SURENDER KUMAR,
జగిత్యాల పట్టణంలో మతసామరస్యం వెల్లివిరిసింది. గణేశుని లడ్డు ప్రసాదంను
ఏసియన్ లోకల్ ఛానల్ (ACN Local Channel )అధినేత ఎండీ అబ్దుల్ సత్తార్ అన్వర్ వేలం పాటలో ₹ 11,111 రూపాయలకు సొంతం చేసుకున్నారు.

జగిత్యాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన గణేష నవరాత్రి ఉత్సవాల లో భాగంగా గణపతి వద్ద పూజించబడిన లడ్డూ వేలం పాట గురువారం జరిగింది. ఈరోజు ప్రెస్ క్లబ్ లోని గణేశుడు నిమజ్జనం కార్యక్రమానికి ముందు గణేశుడు లడ్డు ప్రసాదం వేలం.₹ 3000/- నుంచి ప్రారంభించారు. జర్నలిస్టులు పోటాపోటీగా వేలం పాటలో పాల్గొన్నారు.
