J.SURENDER KUMAR,
తెలంగాణ ఉద్యమాల రథ సారథి, తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆచార్య యం.కోదండరాం కు ఎమ్మెల్సీ కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో సోమవారం ఘనంగా పౌర సన్మానం జరిగింది.
టిజెఎస్ రాష్ట్ర నాయకులు, కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు ముక్కెర రాజు అధ్యక్షతన జరిగిన పౌర సన్మానం కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ఉద్యమాల ఖిల్లా కరీంనగర్ జిల్లా విశిష్టత, ఉద్యమాల సమయంలో ఇక్కడ నుండి జరిగిన ఉద్యమ నేపథ్యంలను గుర్తు చేశారు. పదవి ఉండి ప్రభుత్వంలో భాగ స్వామ్యం అయినప్పటికినీ, నేను ప్రజల పక్షాన నే నిలిచి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గత దశాబ్ద కాలంగా గత ప్రభుత్వ నిర్భందాలను, చేసిన అన్యాయ అక్రమాలను అనేక ఇబ్బందులతో కలిసి కట్టుగా ఎదుర్కోవడం జరిగిందని అన్నారు. అమర వీరుల ఆశయాల సాధన కోసం ఉద్యమకారులము కృషి చేసి వాటన్నిటినీ సాధించాలని పిలుపు నిచ్చారు.

జిల్లా కేంద్రంతో పాటు ఉమ్మడి కరీం నగర్ జిల్లాలోని జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, కరీం నగర్ జిల్లాలలోని వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చిన ఉద్యమ కారులు, జెఎసి, విద్యావంతుల వేదిక, ఇతర ప్రజా సంఘాల నాయకులు ప్రొఫెసర్ కోదండరాం ను సత్కరించారు. ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. పలు ప్రజా సంఘాల వారు, కరీంనగర్ జర్నలిస్టులు వారి – వారి సమస్యల పట్ల ఎమ్మెల్సీ కోదండరాం కు వినతి పత్రాలు అందజేసి, వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు.
సిపిఐ రాష్ట్ర నాయకులు,.మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాలలో కోదండరాం సేవలను గుర్తు చేశారు. కోదండరాం శ్రమను, త్యాగాలను, ఉద్యమాల వ్యూహాలను ఈసందర్భంగా కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జెఎసి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జక్కోజు వెంకటేశ్వర్లు, నాయకులు వెంకట మల్లయ్య, టిజెఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, టిజెఎస్ నాయకులు నరహరి జగ్గారెడ్డి, డొంకెన రవి, అరికెళ్ళ స్రవంతి, సతీష్ యాదవ్, ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి, మార్వాడి సుదర్శన్, చాంద్ పాషా లతో పాటు వివిధ జిల్లాల ఉద్యమకారులు, అభిమానులు పాల్గొన్నారు.