మృతుల కుటుంబలను పరామర్శించిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,


ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బుధవారం తన నియోజకవర్గంలో వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.


👉గొల్లపల్లి మండలంలో..


గొల్లపల్లి మండలం ఇస్రాజ్ పల్లి గ్రామానికి చెందిన భైరం సుగుణ, అందే లక్ష్మీ, చిర్ర నర్సయ్య లు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. వారి కుటుంబ సభ్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించి ఓదార్చారు.


👉పెగడపల్లి మండలంలో..


పెగడ పెల్లి మండలం దికొండ గ్రామానికి చెందిన రామగిరి సత్తమ్మ, ల్యాగలమర్రి గ్రామానికి చెందిన ఉప్పులేటి గంగమ్మ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. వారి కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించి ఓదార్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉప్పులేటి గంగమ్మ కుటుంబానికి ₹ 5 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.


👉ధర్మారం మండలంలో..


ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన పెర్క తిరుమల, రామయ్యపల్లె గ్రామానికి చెందిన మార్క కిష్టయ్య లు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. వారి కుటుంబాలను ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పరామర్శించి ఓదార్చారు. ఎమ్మెల్యే వెంట ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు