నా జీవితం క్రీడ నుండి ప్రజాప్రతినిధి స్థాయికి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


👉క్రీడలు, క్రీడాకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది !


J.SURENDER KUMAR,


నేను కూడా క్రీడ జీవితం నుండి చెత్త సభలలో ప్రజాప్రతినిధి స్థాయికి ఎదిగానని, జీవితంలో గెలుపు ఓటములు సహజమని, పట్టు వదలకుండా లక్ష్యం సాధించడమే క్రీడాకారుల లక్ష్యం కావాలని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద మినీ స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రీడ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో కలిసి పాల్గొని క్రీడలను ప్రారంభించారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రీడల పోటీలను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని,
నేను కూడా క్రీడ జీవితం నుండి ఈ రోజు ప్రజాప్రతినిధిగా ఈ స్థాయిలో ఉండటం అన్నారు.


తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందని,క్రీడారంగంలో కూడా రాష్ట్రం స్థాయిలో జిల్లాను ముందుంచే విధంగా సంబంధిత అధికారులు కృషి చేయాలని, క్రీడాకారులకు భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని,క్రీడాకారులకు సంబంధించి ఎటువంటి అవసరం ఉన్న తన దృష్టికి తీసుకురావాలని,ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయ సహకారాలు అవసరం ఉన్న అందిస్తామని,ప్రభుత్వ క్రీడాకారుల అభ్యున్నతికి కట్టుబటి ఉందని ఈ సందర్భంగా తెలిపారు..


ఈ కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ చైర్మన్ ఆడువాల జ్యోతి, అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..