J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై నిద్రలేని ముందస్తు చర్యల నేపథ్యంలో ప్రాణనష్టం జరగకుండా నివారించగలిగారు. దీనికి తోడు గత రెండు రోజులుగా ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, గోదావరి నది తీర గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తూ బాధిత కుటుంబాలను తరలించడానికి వాహనాలను, పునరావస కేంద్రాలను ( పాఠశాలలు, కళాశాలలో) ముందస్తుగా భోజనాది సౌకర్యాలు ఏర్పాట్లు సిద్ధం చేశారు.

సోమవారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు అధికార యంత్రాంగంతో కలసి గోదావరి నది తీర ప్రాంతంలో పర్యటిస్తూ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టు మంచి గోదావరి నదిలోకి నీటి విడుదల వివరాలు, గ్రామాల్లోకి ఏ మేరకు వరద చేరుతుందని, ఇరిగేషన్ రెవెన్యూ పోలీస్ అధికారులతో చర్చిస్తూ ముందస్తు రక్షణ చర్యలకు అధికారులను అప్రమత్తం చేశారు.

కలెక్టర్, ఎస్పీ, తమ తమ యంత్రాంగాలను అప్రమత్తం చేస్తూ వాగులు ప్రవహిస్తున్న రహదారుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. వాహనాలను కూడా ప్రమాద భరితమైన దారుల వెంట వెళ్లకుండా కట్టడి చేశారు.

భక్తులను గోదావరి నదిలో స్నానాలను చేయకుండా అడ్డుకున్నారు, చేపల వేటను నిషేధించారు. రాయపట్నం, అనంతరం, ఆక్సాయి పల్లె రహదారుల వద్ద బలగాలు ఏర్పాటు చేశారు

కలెక్టర్, ఎస్పీ, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అప్రమత్తమై ముందస్తు గా చేపట్టిన చర్యలు నేపథ్యంలో వరదలు వర్షాల వల్ల ప్రమాదాలు సంభవించి ప్రాణనష్టం జరగకుండా నివారించగలిగారు అనే చర్చ జరుగుతున్నది.