పట్ట భద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తా మీ ఆశీస్సులు కావాలి !

👉ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి !


J.SURENDER KUMAR,


విద్యార్థుల పేరెంట్స్ శ్రేయోభిలాషుల సూచన మేరకు పట్ట భద్రుల ఎమ్మెల్సీ గా పోటీ చేయాలనే ఆలోచన ఉంది. అని విద్యాసంస్థల అధినేత ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
జిల్లా కేంద్రమైన జగిత్యాల పట్టణంలో మంగళవారం ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు.


👉ఆయన మాటల్లో…


👉శాసన మండలిలో నా వాయిస్ వినిపిస్తా ఏ పార్టీకి సంబంధం లేకుండా ఎన్రోల్ మెంట్ స్టార్ట్ చేసాము.


👉చిన్నగా మొదలైన ప్రస్థానం 34 ఏళ్లుగా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది.


👉రాజకీయలకు అతీతంగా విద్యా వ్యవస్థ ను నడుపుతున్నాం.ఉత్తర తెలంగాణ కు గర్వ కారణంగా ఇవాళ ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు ఉన్నాయి.


👉కేజీ నుండి పీజీ వరకు నాకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది ఏ పార్టీ తో ప్రస్తుతం సంబంధం లేకుండా ఉన్నాను. అవసరం అయితే ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేయాలనీ అనుకుంటున్నా .ఇప్పటికే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆశీస్సులు తీసుకున్న


👉ఏ పార్టీ తో ప్రస్తుతం సంబంధం లేకుండా ఉన్నాను. అవసరం అయితే ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేయాలనీ అనుకుంటున్నా


👉3 తరాల జనరేషన్ తో సత్సంబంధాలు కలిగి ఉన్నాను.


👉అందరికి ఉపయోగ పడే కార్యక్రమాలు చేపడుతూ రాజకీయ వేత్తగా రావాలని అనుకుంటున్నా


👉రాజకీయం లోకి వచ్చినా కూడా విద్యా వ్యవస్థను వదిలేది లేదు. భవిష్యత్ లో ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు యధావిధిగా కొనసాగిస్తాం.


👉రెండు రంగాల్లో డ్యూయల్ రోల్ పోషిస్తూ సక్సెస్ అవుతా అన్నారు.