పట్టుబడిన రేషన్ బియ్యం  ఈనెల 27 న వేలం !

J.SURENDER KUMAR,

జిల్లా లో అక్రమముగా తరలిస్తుండగా వివిధ కేసు లలో పట్టుబడిన  దాదాపు 1088.78 క్వింటాళ్ళ తినడానికి పనికి వచ్చే PDS బియ్యం మరియు 167.93 క్వింటాళ్ళ తినడానికి పనికి రాని PDS బియ్యం ను ఈ నేల 27  సాయంత్రం  జగిత్యాల కలెక్టర్ (పౌర సరఫరాలు) కార్యాలయంలో వేలం జరగనున్నదనీ జిల్లా పౌర సరఫరాల అధికారి  జితేందర్ రెడ్డి, ప్రకటనలో పేర్కొన్నారు.


టెండర్ దరఖాస్తు ఫారం కు ₹ 3000/- తిరిగి చెల్లించని మొత్తం ఇది. వేలంలో పాల్గొని వారు
₹ 2 లక్షల రూపాయలు డిపాజిట్ చెల్లించాలని ప్రకటన లో పేర్కొన్నారు. బహిరంగ వేలములో పాలుగొనేవారు తమ యొక్క ఆధార్, మరియు పాన్ కార్డు, ప్రతులను DD తో సహా సమర్పించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

పత్రికా ప్రకటన..


ఇతర వివరముల కొరకు జిల్లా పౌర సరఫరాల అధికారి గారి కార్యాలయము, జగిత్యాల, సమీకృత జిల్లా కార్యాలయముల సముదాయం, జగిత్యాల లేదా సెల్ నెం. 86399 19527 సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.