పేదలను మా ప్రభుత్వం పడగొట్టదు నిలబెట్టాలన్నదే ప్రభుత్వ విధానం !

👉సీఎల్పీలో మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు!


J.SURENDER KUMAR,


పేదలను మా ప్రభుత్వం ఎప్పుడు పడగొట్టదు నిలబెట్టాలన్నదే మా ప్రభుత్వ విధానం అని ఆదివారం సీఎల్పీలో మీడియా సమావేశంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ సమావేశంలో ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ తో కలిసి మంత్రి ప్రతిపక్ష నాయకులు చేసినా ఆరోపణలకు ఘాటుగా సమాధానం ఇచ్చారు.


👉
సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..

👉మల్లన్న సాగర్ రైతులపై బుల్డోజర్ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ అన్నారు.!

👉హైడ్రా బూచి చూపించి కొంతమంది అవకాశ వాదులు రెచ్చగొట్టే పనిలో ఉన్నారు!


👉మూసి నీ పరిరక్షించుకోవాలనీ మా ప్రభుత్వం భావిస్తుంది
!


👉కొందరు తెలిసో…తెలియకనో.. ఇండ్లు కట్టారు!


👉పేదలను పడగొట్టలని ప్రభుత్వం ఎప్పుడు చూడదు.. నిలబెట్టాలన్నదే మా ప్రభుత్వ విధానం!


👉రివర్ బెడ్ లో ఉన్న అక్రమ నిర్మాణాలు తొలగిస్తామని అధికారులు కూడా చెప్పారు!


👉మూసి బాధితులకు డబులు బెడ్ రూం లు ఇస్తున్నాం !
👉సొంత ఇల్లు కళ నెరవేర్చుతాం!


👉అందరిని కాపాడుకునే బాధ్యత మాది మా ప్రభుత్వానిది బాధితులను మా బిడ్డల్లా చూసుకుంటాం!


👉మూసి లో స్వచ్ఛమైన నీటిని పారించాలని ప్రయత్నం చేస్తున్నాం!


👉మూసి లోకి గోదావరి నీళ్లు తెస్తాం. మూసి పై లింక్ రోడ్లు వేస్తాం!


👉మూసి బాధితులను ఆదుకుంటాం.. ఎవరిని విస్మరించం!


👉NGO ల సలహాలు సూచనలతో ముందుకు వెళ్తున్నాం!


👉రివర్ బెల్ట్ లో.. భూసేకరణ చట్టం అమలు చేస్తాం!


👉బీఆర్ఎస్ లో కొందరు నేతలు బూతద్దం లో పెట్టీ చూపెట్టే పనిలో ఉన్నారు!


👉FTL దాచిపెట్టి అమ్మిన బిల్డర్స్ పై చర్యలు తీసుకుంటాం!


👉అనుమతులు ఇచ్చిన అధికారులు… వారిపై ఒత్తిడి తెచ్చింది ఎవరన్నది బయట పెడతాం!


👉త్వరలో హెల్ప్ డెస్కులు.. హైడ్రా.. మూసి పరివాహక ప్రజల అనుమానాల పై కలెక్టరేట్ లో హెల్ప్ డెస్క్ లు!


👉BRS వాళ్ళు మొసలి కన్నీరు కారుస్తున్నారు!


👉మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు ఏం చేశారు ?


👉మీ హయాంలో మల్లారెడ్డి అనే రైతు చితి పెట్టుకుని నిప్పు అంటించుకున్నారు!


👉భూ నిర్వాసితులకు చట్టం అమలు చేయాల్సింది పోయి కొత్త GO తెచ్చారు!


👉ప్రాజెక్టులు కడితే మా ఇండ్లు కూడా పోయాయి అని గతంలో కేసీఆర్..కేటీఆర్ అన్నారు ఇప్పుడేమో ప్రజల్ని ఉసికొలుపుతున్నారు!


👉మేము మల్లన్న సాగర్ వెళ్తాం అంటే.. పోలీసులను పెట్టీ అరెస్టు చేశారు!


👉మేము బీ ఆర్ఎస్ వాళ్ళను ఇప్పుడు ఎక్కడైనా అడ్డుకునామా ?


👉మాది ప్రజా పాలన కాబట్టి.. బాధితుల వద్దకు కూడా బీఆర్ఎస్ వాళ్ళను వెళ్ళనిచ్చం!


👉ప్రజల ఇబ్బందికి సలహాలు ఇస్తారని అడ్డుకోలేదు!


👉కొందరి అత్యుత్సాహం తో ప్రజలు కొంత ఆందోళన కి గురి కావచ్చు!


👉నోటీసులు ఇచ్చిన తర్వాతనే చర్యలు తీసుకుంటున్నారు అధికారులు!


👉సోషల్ మీడియా లో ఐదు వేలు ఇచ్చి సిఎం పైనా మాట్లడిస్తున్నారు. వాటిపై విచారణ జరిపిస్తాము!


👉అక్రమ నిర్మాణాలు ఇచ్చిన అధికారులు… బిల్డర్స్ పై చర్యలు ఉంటాయి!


👉తప్పుడు పెపర్స్ తో అనుమతులు ఇచ్చిన వారిపైనా చర్యలు ఉంటాయి!


👉బుల్డోజర్ పాలసీ బీఆర్ఎస్ ది!


👉అక్రమ నిర్మాణం పై బుల్డోజర్ పోయింది..అది తప్పా!


👉అక్రమ నిర్మాణం లకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తున్నారా ?


👉మల్లన్న సాగర్ రైతులపై బుల్డోజర్ పెట్టింది బీ ఆర్ఎస్ వాళ్లు కాదా ? అని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు.