👉జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్!
J.SURENDER KUMAR,
జిల్లా లో దూర ప్రాంతాల నుండి అనేక మంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పిస్తాను అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో లైబ్రరీని బుధవారం ఎమ్మెల్యే సందర్శించి, పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న నిరుద్యోగ యువత తో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
లైబ్రరీలో కరెంటు మరియు స్టేషనరీ సమస్య తన దృష్టికి వచ్చిందని సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు
₹1 కోటి రూపాయలతో నిర్మిస్తున్న లైబ్రరీ భవనాన్ని త్వరిత గతిన పూర్తి చేసి, జిల్లా గ్రంథాలయాన్ని సొంత భవనం లోకి మార్చే విధంగా చొరవ తీసుకుంటా అన్నారు.
గ్రామ పంచాయతీలలో లైబ్రరీ సెస్సు వసూలు చేసే విధంగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, లైబ్రరీ ల బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో బిసి స్టడీ సెంటర్ ఏర్పాటు తో నిరుద్యోగ యువత కు పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే విధంగా స్టడీ సెంటర్ ఏర్పాటు చేయాలని ఫోన్ ద్వారా బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు వివరించారు.
ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ శకుంతల, మాజీ లైబ్రరీ డైరెక్టర్ చేట్పల్లి సుధాకర్, కౌన్సిలర్ లు కూసరి అనిల్, ముస్కు నారాయణ రెడ్డి, యూత్ నాయకులు కత్రోజ్ గిరి, యం ఏ అరిఫ్, చిట్ల మనోహర్, జంగిలీ శశి, రామ కృష్ణ రెడ్డి, రమేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.