ప్రభుత్వ భూములను కాపాడండి జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్ !

J.SURENDER KUMAR,

ఎమ్మార్వో , ఎండోమెంట్, అధికారుల తో శనివారం జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్. సమీక్ష సమావేశం నిర్వహించారు.
కలెక్టరేట్ కార్యాలయం సమావేశ భవనంలో సమావేశం నిర్వహించినారు. ఈ సమావేశంలో మండలంలోని ధరణి అప్లికేషన్లపై, మరియు కోర్టు కేసులు, ఎండోమెంట్, వక్ఫ్ భూముల పై సమీక్ష నిర్వహించారు.

తాసిల్దార్లు వారి పరిధిలో గల ప్రభుత్వ భూముల పరిరక్షణ, మరియు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి సంబంధించిన భూముల సర్వే చేసి వారి భూముల హద్దులు చూపెట్టి వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధరణి కి సంబంధించిన దరఖాస్తులు త్వరితగతిన ప్రజలకు ఇబ్బంది కలగకుండా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ ఆదేశించారు.

ప్రభుత్వ ఆదేశాలతో క్రమం తప్పకుండా ,భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాల నిమిత్తం భూములను గుర్తించి జిల్లాలో అభివృద్ధికి, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమీక్ష సమావేశంలో జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి , ఆర్డీవో లు , మధుసూదన్, శ్రీనివాస్, కలెక్టరేట్, ఏవో, హన్మంతు రావు, కలెక్టరేట్ , సూపర్డింట్స్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.