👉రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది !
J.SURENDER KUMAR,
రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు ₹ 2 లక్షల వరకు రుణాలను మాఫీ చేయడం జరిగిందనీ, రుణాలు మాఫీ కానీ రైతులు ఎవ్వరు అధైర్య పడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురి మండలం దోనూర్ గ్రామంలో ₹ 15 లక్షల వ్యయంతో మరియు కమలాపూర్ గ్రామంలో ₹ 11 లక్షల వ్యయంతో, నేరెళ్ళ గ్రామంలో ₹ 34 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఎరువుల గోదాములను మంగళవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలను వందకు వంద శాతం అమలు చేస్తాం.
రైతులకు మేలు చేసే ఎరువుల గోదాముల ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, రైతులకు ఇబ్బందులు కలగకుండా ఎరువుల నిల్వలను అందుబాటులో ఉంచుకోవాలని, ఎరువుల విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్న నా దృష్టికి తీసుకురావాలని, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీల ను వందకు వంద శాతం అమలు చేయడం జరుగుతుందని,

ఈ ప్రాంతానికి సంబంధించి లిఫ్ట్ లను కూడా గత ప్రభుత్వ అనాలోచిత విధానాల వలన పూర్తిగా నిర్లక్ష్యానికి గురికావడం జరిగిందని, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి వాటికి మరమ్మతులు చేసి పునరుద్ధరిస్తామని, 2016 లో ప్రారంభమైన రోళ్ళ వాగును గత ప్రభుత్వ హయంలో పూర్తి చేయలేదని, దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి కొన్ని ఇబ్బందులు ఉన్నట్లు నా దృష్టికి తీసుకురావడం జరిగిందనీ, అట్టి విషయాన్ని కూడా జిల్లా కలెక్టర్ తో మాట్లాడి దాన్ని కూడా పూర్తి చేస్తామని, అదే విధంగా పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం చేపట్టి ధర్మపురి నియోజకవర్గ ప్రాంత రైతాంగానికి నీరు అందిస్తామని ఈ సంధర్బంగా తెలిపారు..
ఈ కార్యక్రమంలో అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.