👉 రేషన్ కార్డుపై సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తాం !
J.SURENDER KUMAR,
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుందని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని క్యాంపు కార్యాలయంలో జాతీయ పతకాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందని, నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం చేసి ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోవడం, జవహల్ లాల్ నెహ్రు, లాల్ బహదూర్ శాస్త్రి,సర్ధార్ వల్లభాయ్ పటేల్ కృషి ఫలితంగా నిజాం పాలన నుండి రాష్ట్రానికి విముక్తి కలిగిందని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారికంగా సెప్టెంబర్ 17 ను ప్రజా పాలన దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందనీ, అదే విధంగా ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయడం జరుగుతుందని, ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా రేషన్ కార్డులను జారి చేస్తామని, త్వరలోనే రేషన్ కార్డు పై సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు