ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

👉ధర్మపురిలో మెగా హెల్త్ క్యాంప్!

👉347 మందికి వైద్య పరీక్షలు ఉచిత మందులు పంపిణీ !

👉 130 మందికి రక్తపరీక్షల నిర్వహణ !


J.SURENDER KUMAR

ప్రజల ఆరోగ్యమే మా ప్రజా ప్రభుత్వ లక్ష్యం ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టిందని అందులో భాగమే మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ధర్మపురి పట్టణంలోని స్థానిక బ్రాహ్మణ సంఘం భవనంలో ప్రభుత్వం నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపు ను ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ తో కలిసి ప్రారంభించారు.


అనంతరం హెల్త్ క్యాంపుకు వచ్చిన ప్రజలతో ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులు, వైద్య సిబ్బంది మండల నాయకులతో కలిసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..


ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ ను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, అకాల వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయని, గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు కొంత డెంగ్యూ కేసులు అధికంగా నమోదు కావడం జరిగిందని అన్నారు. ప్రజలు భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదనీ, గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు హెల్త్ క్యాంపులు, వైద్య పరీక్షలు మూడు వంతులు పెంచామన్నారు.


ప్రభుత్వం ప్రజారోగ్యం పట్ల అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ, ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందస్తుముందస్తు జాగ్రత్తలు పాటించాలని, మున్సిపల్ అధికారులు, పారిశుధ్య పనులపైన ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఎమ్మెల్యే లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు. పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ, ప్రజల ఆరోగ్యం విషయంలో ఎక్కడ రాజీ పడే సందర్భం లేదన్నారు.

👉347 మందికి వైద్య పరీక్షలు !

మెగా వైద్య శిబిరంలో పదిమంది వైద్యులు, 40 మంది వైద్య సిబ్బంది, 347. మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో 47 మంది జ్వరాలతో బాధపడుతుండగా వారికి డెంగ్యూ నిర్ధారణ కాలేదు. 130 మంది రక్త నమూనాల సేకరించి టీ హబ్ కు పంపించారు.


వైద్య, రెవెన్యూ అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు