ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం జరుపుకోవాలి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,


భక్తజనం భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో గణేశుడి నిమజ్జనం జరుపుకోవాలని అధికారులకు నిర్వాహకులకు సహకరించాలని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అల్లూరి లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.


ధర్మపురి క్షేత్రంలో కొనసాగుతున్న వినాయక నిమజ్జనం కార్యక్రమంలో మంగళవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు


ఈ సంధర్బంగా స్థానిక నంది విగ్రహం వద్ద మున్సిపల్ ఆధ్వర్యంలో మరియు ఇసుక స్థంభం వద్ద విశ్వహిందూ పరిషత్ ఏర్పాటు చేసిన స్వాగతోత్సవ కార్యక్రమంలో పాల్గొని వినాయకుడికి కొబ్బరికాయ కొట్టి గణేశ శోభయత్రను ప్రారంభించారు.


అనంతరం దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కూల్ వాటర్ పంపిణీని కార్యక్రమాన్ని ప్రారంభించారు.


ఈ సందర్భగా వారు మాట్లాడుతూ..


నిమజ్జనానికి వచ్చే విధంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా అధికారులకు ప్రజలు సహకరించాలని, ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.


స్వామివారి దయతో ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీను నేరవేర్చే విధంగా స్వామివారి కృప మా పైన ఉండాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.