ప్రతి పేద వాడికి సంక్షేమ ఫలాలు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ !

👉సిఎం రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది !

J.SURENDER KUMAR,


ప్రతి పేద వాడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందలన్న లక్ష్యంతో ముందుకు వెళ్లడం జరుగుతుందని, ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటిలను వంద కి వంద శాతం అమలు చేసి తీరుతామని, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మంగళవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రభుత్వ సందేశం ఇచ్చారు.


ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ హోదాలో జాతీయ జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ సందేశాన్ని చదివి వినిపించారు.


ఈ సంధర్బంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ


సెప్టెంబర్ 17, 1948 లో తెలంగాణ నిజాం చెర నుండి విముక్తి పొంది భారత దేశంలో విలీనం కావడం జరిగిందని, సెప్టెంబర్ 17 ను అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో విద్యుత్, నీటిపారుదల, వ్యవసాయ, పరిశ్రమలు, ఉద్యోగ ఉపాధి కల్పన, అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు.


మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం,₹ 500 కి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్,₹10 లక్షల వరకు ఆరోగ్య శ్రీ పెంపు, నియోజక వర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు,₹ 2లక్షల వరకు రుణమాఫీ,రైతులకు ₹15వేల రూపాయల రైతు భరోసా,సన్న వడ్లకు ₹ 500 బొనస్,పంట బీమా, ప్రైవేట్ కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ వివరించారు.