రాష్ట్రపతికి హైదరాబాదులో ఘన స్వాగతం!

J. SURENDER KUMAR,


హైదరాబాద్ పర్యటనకు శనివారం వచ్చిన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కు బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు.

రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీమతి సీతక్కతో పాటు, నగర మేయర్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మీ, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, త్రివిధ దళాలకు చెందిన ప్రతినిధులు రాష్ట్రపతి గారికి స్వాగతం పలికారు.


రాష్ట్రపతి ద్రౌపది ముర్ము , గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొంటారు.