👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
రేషన్ కార్డులు లేని వారికి ప్రభుత్వం త్వరలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నామని, రేషన్ కార్డుల పైన సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తామని దాని పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వా విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
బుగ్గారం మండల కేంద్రంలోని స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా సుమారు ,₹ 29 లక్షల విలువ గల 28 చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ..
కళ్యాణ లక్ష్మి చెక్కులను అందుకున్న లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, ఈ విడతలో చెక్కులు రాని వారికి మరో విడతలో పంపిణీ చేస్తామని,.బుగ్గారం మండలంలో ఇటీవలే ప్రభుత్వ కార్యాలయాల నూతన భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు.
త్వరలోనే వాటి నిర్మాణాలు పూర్తి చేస్తామని, ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని, ఇటీవల రైతులకు ₹ 2 లక్షల రూపాయల రుణాలను మాఫీ చేయడం జరిగిందన్నారు. రుణాలు మాఫీ కానీ వారు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, త్వరలోనే సమస్యను పరిష్కరించి రుణాలు మఫి కానీ రైతులకు కూడా రుణమాఫీ చేస్తామని, ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు