J.SURENDER KUMAR,
రైస్ మిల్లర్లు తమ సమస్యలను నా దృష్టి తెచ్చిన వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కారానికి కృషి చేస్తానని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురి పట్టణంలోని స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహ గార్డెన్స్ లో రైస్ మిల్లర్ల ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైస్ మిల్లర్ల ఆధ్వర్యంలో తనను సన్మానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. రైస్ మిల్లర్లకు సంబందించిన కొన్ని సమస్యలను నా దృష్టికి తీసుకురావడం జరిగిందని సాధ్యమైనంత మేరకు.వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
👉షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ!

గొల్లపెల్లి మండల కేంద్రానికి చెందిన ముగ్గురు లాభక్తులకు.₹ 3 రూపాయల విలువ గల 3 షాదిముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమలలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు