ఆర్టీసీ కి నూత‌న బ‌స్సుల కొనుగోలు సీఎం రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,


ప్ర‌జల అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఆర్టీసీ నూత‌న బ‌స్సుల కొనుగోలు చేయాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పెరిగిన అవ‌స‌రాలు, నూత‌న మార్గాల‌ను అందుకు ప్ర‌తిపాదిక చేసుకోవాల‌ని సూచించారు.
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆర్టీసీ కార్యకలాపాలపై ముఖ్యమంత్రి మంగళవారం సమీక్షించి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ , ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


👉మ‌హాల‌క్ష్మి ప‌థకం మ‌హిళ‌లు వినియోగించుకుంటున్న తీరుపై ముఖ్య‌మంత్రి ఆరా తీశారు. మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని అధికారులు వివరించారు.


👉 ఇప్పటి వరకు 83.42 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేయగా, తద్వారా ప్రయాణికులకు ₹ 2,840.71 కోట్లు ఆదా అయినట్టు అధికారులు చెప్పారు.


👉ఆర్టీసీకి చెందిన 7,292 బ‌స్సుల్లో మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం వ‌ర్తిస్తుండగా, ఈ ప‌థ‌కం ప్రారంభ‌మైన త‌ర్వాత వివిధ జిల్లాల నుంచి హైద‌రాబాద్‌లోని ఆస్పత్రులకు వ‌స్తున్న మ‌హిళ‌ల సంఖ్య పెరిగినట్టు అధికారులు వివరించారు.