రైతుల మోటార్ పంపు సెట్లకు ఉచిత సోలార్ విద్యుత్తు !

👉పైలెట్ ప్రాజెక్టులుగా 25 గ్రామాలలో మేడారం గ్రామం ఎంపిక !


👉రైతుల రుణాలు ₹ రెండు లక్షల పైన ఉన్న మాఫీకి ఆలోచన చేస్తున్నాం !


👉పత్తిపాక రిజర్వాయర్ పనులకు త్వరలో సర్వే !


👉ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ !


👉ధర్మారం బహిరంగ సభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క
.


J.SURENDER KUMAR,


కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వ పాలనలో రైతులకు ₹ 2 లక్షల రుణమాఫీ చేశాం, ఆపై ఉన్న రైతులకు కొంత మొత్తాన్ని మాఫీ చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని, రైతు సంక్షేమం కోసం వ్యవసాయ పంపుసెట్లకు ప్రభుత్వమే ఉచితంగా సోలార్ విద్యుత్తు ఏర్పాటు చేయనున్నదని ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు.


పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో శనివారం వివిధ అభివృద్ధి పనుల భూమి పూజకు, భూనిర్వాసతులకు కోట్ల రూపాయల నష్టపరిహారం అందజేయడానికి డిప్యూటీ సీఎం మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎంపీ గడ్డం వంశి, ఎమ్మెల్యేలు లక్ష్మణ్ కుమార్, రాజ్ ఠాగూర్ మక్కాన్సింగ్ విజయ రమణారావు తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ..


రైతుల రుణమాఫీ అంశంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని, తమ ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రుణం మాఫీ చేసిందని, ఆ పైన రుణం ఉన్న రైతుల ఆర్థిక స్థితిగతులను పరిశీలించి అవి కూడా మాఫీ చేసే ఆలోచన చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి అన్నారు.


రైతుల వ్యవసాయ పంపు మోటార్లకు ప్రభుత్వ ఖర్చులతోనే సోలార్ విద్యుత్తు ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 25 గ్రామాలను పైలెట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేశామని బట్టి విక్రమార్క అన్నారు. ధర్మారం మండలంలోని నంది మేడారం పైలెట్ ప్రాజెక్టులో ఒకటిగా ఎంపిక చేశామన్నారు. రైతులు సోలార్ విద్యుత్ వినియోగంతో పాటు మిగిలిన విద్యుత్తును గ్రిడ్జ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసి ఆ మోటర్ పంప్ సెట్ రైతుకు కొంత మొత్తం చెల్లించి రైతును ఆర్థికంగా బలోపేతం చేసే ఆలోచన ప్రభుత్వం చేస్తుందన్నారు.


👉పత్తిపాక రిజర్వాయర్ పనులకు త్వరలో సర్వే జరుగుతుంది


వేలాది ఎకరాల వ్యవసాయానికి సాగునీరు అందించే పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణ పనులకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయించిందని. త్వరలో సర్వే పూర్తిచేసి నిర్మాణ పనులకు భూమి పూజ చేస్తానని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.
ఇదే తరహాలో పత్తిపాక ఎత్తిపోతల పథకం, రామగుండం లో పదివేల కోట్లతో విద్యుత్తు థర్మల్ విద్యుత్తు తదితర అభివృద్ధి పనులు ప్రారంభించనున్నట్టు డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.


👉ధర్మపురి లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ !


విద్యా సంస్థల హబ్ గా మారిన ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పట్టు వదలని విక్రమార్కుడిలా పదేపదే వినతి పత్రాలు ఇచ్చారని, 28 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు.


👉ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, తెలివైనవాడు
మంత్రి శ్రీధర్ బాబు..


ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ చాలా తెలివైనవాడు ఉదయం 6 గంటలకే తన వద్దకు వచ్చి భూనిర్వాసితులకు నష్టపరిహారం గూర్చి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు, కలెక్టర్ కు ఫోను చేయించుకుని పనులు చేయించుకుంటాడని, మంత్రి శ్రీధర్ బాబు తన ప్రసంగంలో అన్నారు.
షేగ్గ్యామ గ్రామానికి చెందిన 125 మంది భూ నిర్వాసితులకు గత పది సంవత్సరాలుగా అందని ₹18 కోట్ల రూపాయల నష్ట పరిహార చెక్కుల విడుదల కోసం మీ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ దాదాపు 18 సార్ మా చుట్టూ ప్రదక్షిణాలు చేశారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.


👉అభివృద్ధి పనులకు భూమి పూజలు!


సీఎం భట్టి విక్రమార్క మల్లు , మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మణ్ కుమార్, విజయ రమణారావు, రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ తదితరులు. ముందుగా అభివృద్ధి పనులకు భూమి పూజలు చేశారు. ధర్మారం మండలంలో నంది మేడారం వద్ద 33/11kv సబ్ స్టేషన్ మరియు కటికెనపల్లి వద్ద సబ్ స్టేషన్ పనులకు శంకుస్థాపన చేసి తదనంతరం ఎల్లంపల్లి చెగ్యాం గ్రామానికి చెందిన 125 కుటుంబాలకు ₹18కోట్ల రూపాయలను నష్ట పరిహారంగా అందజేశారు.


👉మార్కెట్ కమిటీల పాలకవర్గ ప్రమాణస్వీకారం!


స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభ వద్ద ధర్మారం, వెల్గటూరు, గొల్లపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు గా నియమితలైన వారి ప్రమాణస్వీకార కార్యక్రమం మంత్రులు ఎమ్మెల్యేల సమక్షంలో జరిగింది.