సమాజానికి చికిత్స చేసేవారు జర్నలిస్టులు సీఎం రేవంత్ రెడ్డి!


👉హైదరాబాదులో 11 వందల మంది జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు పంపిణీ!

👉మీడియా అకాడమీకి ₹10 కోట్లు కేటాయింపు !


J.SURENDER KUMAR,


సమాజానికి చికిత్స చేసేవారు జర్నలిస్టులు, డాక్టరులు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి చెందిన పదకొండు వంద (1100 ) ల మంది జర్నలిస్టులకు చెందిన భూమి పట్టాలను ఆ సొసైటి నాయకులకు అందజేసారు. 

మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మీడియా అకాడమి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సమాచార శాఖ కమిషనర్ హన్మంతు రావు, సీనియర్ జర్నలిస్ట్ నాయకులు దేవులపల్లి అమర్ తదితరులు పాల్గొన్నారు.


రవీంద్రభారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్..

👉జర్నలిస్టులు, డాక్టర్లు సమాజానికి చికిత్స చేసే డాక్టర్లు .

👉 జర్నలిస్టుల సంక్షేమం కోరుతూ ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆనాడు వైఎస్ఆర్ నిర్ణయం తీసుకున్నారు.

👉జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి శశబిషలు లేవు.

👉మీ సమస్యకు మా ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తోంది.

👉వృత్తిపరమైన గౌరవాన్ని ఎవరూ పెంచరు.. అది మనకు మనమే పెంచుకోవాలి.

👉ప్రజాభిప్రాయం, జర్నలిస్టుల సూచనలతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోంది.

👉వ్యవస్థలపై నమ్మకం పెంచాలన్నదే మా ప్రభుత్వ విధానం..

👉జర్నలిజం కూడా వ్యవస్థల్లో ఒక భాగమే.

👉ఆనాడు రాజాకీయ పార్టీలు సిద్ధాంత భావజాల వ్యాప్తి కోసమే పత్రికలు ఏర్పాటు చేసుకునేవి.

👉కానీ ఈరోజుల్లో ఉన్మాద ధోరణితో వ్యవహరించే పరిస్థితులు దాపురించాయి.

👉కొందరు చేసే పనులతో జర్నలిస్టులందరికీ చెడ్డపేరు వస్తోంది.

👉కొంతమంది జర్నలిస్టు పదం అర్ధాన్నే మార్చేస్తున్నారు.

👉అలాంటి వారిని నియంత్రించే బాధ్యత మీపైనే ఉంది.

👉నిజమైన జర్నలిస్టులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వానిది.

👉భాష విషయంలోనూ కొన్ని పత్రికలు గీత దాటుతున్నాయి.

👉ముఖ్యమంత్రి హోదానూ అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారు.

👉కేవలం రాజకీయ పార్టీల యజమానులను రక్షించేందుకే వారు ప్రాధాన్యతనిస్తున్నారు.

👉అలాంటి వారిపై తీసుకునే చర్యలను నిజమైన జర్నలిస్టులు ఆపాదించుకోవద్దు.

👉నిజమైన జర్నలిస్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది.

👉ఆరోగ్య భద్రత కార్డులు, అక్రిడేషన్ ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం మీడియా కాడమీ కొత్త విధి విధానాలు తయారు చేయాలని ఆదేశిస్తున్నా.

👉వాటికి కేబినెట్ ఆమోదం తెలిపే బాధ్యత మేం తీసుకుంటాం.

👉తెలంగాణకు టూరిజం, ఎనర్జీ, స్పోర్ట్స్ పాలసీలు లేవు.

👉గత పదేళ్లుగా తెలంగాణకు అసలు పాలసీలే లేవు.

👉మేం మీలో ఒకరమే… మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత మాదే.

👉మీడియా అకాడమీకి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ₹ 10కోట్లు ఇస్తున్నా..

👉ఇళ్ల స్థలాల విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దు.


👉అర్హులైన వారిని ఫ్యూచర్ సిటీలో భాగస్వాములను చేస్తాం.

👉ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో మనందరం భాగస్వాములమవుదాం.