👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా సేవలందిస్తున్న మీడియా సామాజిక సేవ చేపట్టడం శుభ పరిణామం అని ధర్మపురి ఎమ్మెల్యే,. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురి మున్సిపల్ ఆవరణలో శనివారం బిగ్ టీవీ చానల్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో ధర్మపురి ఎమ్మేల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు..
ఈ సందర్భగా వారు మాట్లాడుతూ..
బిగ్ టీవీ చానల్ వారి ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, నిర్వాహకులను అభినందించారు. ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం తరఫున ఇటీవల ధర్మపురిలో, వెల్గటూర్, ధర్మారం మండలాల్లో హెల్త్ క్యాంపులను నిర్వహించడం జరిగిందని, ప్రజల ఆరోగ్యం విషయంలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదని, ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహకారాలు అందజేస్తున్నప్పటికి ప్రజలు కూడా స్వచ్ఛందంగా పరిశుభ్రతను పాటించాలని, ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల టెస్ట్ కిట్లు, మందులు అందుబాటులో ఉంచడం జరిగిందని ప్రజల ఎవ్వరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..