J.SURENDER KUMAR,
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో అక్టోబరు 4 నుంచి 12 వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలలో పాల్గొనవలసిందిగా కోరుతూ కావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును టిటిడి ఆహ్వానించింది.

ఆదివారం విజయవాడలోని ఉండవల్లిలోని సీఎం నివాసంలో టీటీడీ ఈవో జె.శ్యామలరావు, అడిషనల్ ఈవో సిహెచ్.వెంకయ్య చౌదరితో కలిసి సీఎంకు బ్రహ్మోత్సవ ఆహ్వానం అందించారు.

ఈ సందర్భంగా తిరుమల దేవస్థానం టీటీడీ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, వేద పండితులు సీఎంకు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆయనకు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.