తెలంగాణ ఆత్మబంధువు కొండా లక్ష్మణ్ బాపూజీ !

👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మబంధువు, స్వాతంత్ర సమరయోధుడు
స్వర్గీయ కొండ లక్ష్మణ్ బాపూజీ అని ధర్మపురి ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు
కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు..


అనంతరం దేవి నవరాత్రులకు సంబందించిన కర పత్రాన్ని నాయకులతో కలిసి ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
స్వాతంత్ర్య సమరయోదుడు తెలంగాణ ఉద్యమకారుడు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడిన కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పింస్తున్నమని, 90 సంవత్సరాల పై వయస్సులో కూడా డిల్లీ జంతర్ మంతర్ వద్ద తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేసిన వ్యక్తిఅని, మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడిచిన మహనీయుడు లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనునిత్యం పాటు పడిన గొప్ప వ్యక్తి అని, తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవిని కూడా తృణ ప్రాయంగా వదులుకున్నారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి సారి వారి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నామని, రాష్ట్రన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే వారికి మనం ఇచ్చే నివాళి అని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు