J.SURENDER KUMAR,
పౌర్ణమి గరుడ సేవ సందర్భంగా బుధవారం సాయంత్రం తిరుమలలో గరుడసేవ ట్రయల్ రన్ నిర్వహించారు. సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు గరుడ వాహనంపై శ్రీ మలయప్ప స్వామి నాలుగు మాడ వీధుల్లో భక్తులను ఆశీర్వదించారు.
టీటీడీ ఈవో జె శ్యామలరావు, అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎస్‌వో శ్రీధర్‌తో కలసి వాహనం ఊరేగింపు ముందు త్రీ రోప్ సెక్యూరిటీ, నాలుగు మాడ వీధుల్లో గ్యాలరీలు, ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్‌లు, నృత్య బృందాల ప్రదర్శన, సామగ్రిని పరిశీలించారు. .ఆలయ డీఈవో లోకనాథం, ఈఈ సుబ్రహ్మణ్యం, వీఎస్ఓలు సురేంద్ర, శ్రీరామ్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.