J.SURENDER KUMAR,
తిరుమలలో శ్రీవారి కైంకర్యాల లోనే జీవితాంతం గడిపిన శ్రీ తిరుమల నంబి సేవలను అహోబిలం మఠం శ్రీమాన్ శ్రీవన్ శతహోప రంగనాథ యతీంద్ర మహా దేశికన్ స్వామి ప్రశంసించారు.
దక్షిణ మాడవీధిలోని తిరుమల నంబి ఆలయంలో శ్రీ తిరుమల నంబి 1051వ అవతారోత్సవంలో సోమవారం పాల్గొన్న స్వామి, శ్రీ యమునాచార్యుల ఆదేశాల మేరకు తిరుమల నంబి వృద్ధాప్యంలోనూ ప్రతిరోజూ పాపవినాశానికి వెళ్లి శ్రీవారి అభిషేకానికి పవిత్ర జలాన్ని తీసుకోవచ్చే వారన్నారు.
శ్రీవారు తన భక్తుడు నంబికి సహాయం చేయడానికి అభిషేకం కోసం ఆకాశగంగను గర్భం లో ధరించారని పురాణాలు చెబుతున్నాయి. అని అన్నారు.

ఈ సందర్భంగా టిటిడి అడిషనల్ ఇవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ తిరుమల నంబి క్రీ.శ.973లో తిరుమలకు చేరుకుని తీర్థకైంకర్యం, మంత్ర కైంకర్యం, వేదపారాయణ కైంకర్యం తదితర కైంకర్యాలను ప్రారంభించారన్నారు.
శ్రీవారి ఇష్ట భక్తుల సేవలను పురస్కరించుకుని టిటిడి ప్రతి సంవత్సరం తిరుమలలోని ఉప క్షేత్రంలో మహోత్సవాన్ని నిర్వహిస్తుందన్నారు.
తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన 16 మంది ప్రముఖ పండితులు తిరుమలలో తిరుమల నంబికి ఘనంగా నివాళులర్పించారు.
టిటిడి ధార్మిక ప్రాజెక్టుల కార్యక్రమ అధికారి రాజగోపాల్, ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు కార్యక్రమ అధికారి పురుషోత్తం, శ్రీ తిరుమల నంబి వారసులు శ్రీ తాతాచార్య కృష్ణమూర్తి, శ్రీ సి రంగనాథన్ తదితరులు పాల్గొన్నారు.