తిరుమల శ్రీవారి హుండీ  ఆదాయం ఆగస్టులో ₹ 125.67 కోట్లు !

J.SURENDER KUMAR,


తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ఆగస్టు మాసంలో ₹ 125.67 కోట్లు వచ్చిందని కార్యనిర్వహణాధికారి జై శ్యామల రావు తెలిపారు.

శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో నెలవారీ డయల్ యువర్ -ఈవో కార్యక్రమం అనంతరం మీడియా ప్రతినిధులతో టీటీడీ కార్యనిర్వహణాధికారి మాట్లాడారు. ఆగస్టు మాసంలో శ్రీవారిని 22.42 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. లడ్డూ ప్రసాదాలవిక్రయం ద్వారా ₹1.06 కోట్లు అన్న ప్రసాదం 24.33 లక్షలు కళ్యాణ కట్ట: 9.49 లక్షల టన్నులు వచ్చాయని ఈవో వివరించారు.


రుచికరమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం ప్రతి భక్తునికి చేరేలా టీటీడీ కృషి చేస్తోందని టీటీడీ ఈవో  అన్నారు. ఇక నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని టీటీడీ ఆలయాలు, సమాచార కేంద్రాల్లో శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అందుబాటులో ఉంచుతామని తెలిపారు. శ్రీవారి లడ్డూల విక్రయాలను ప్రారంభించేందుకు బయటి ఆలయాలు, టీటీడీ సమాచార కౌంటర్ల వద్ద మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇతర ప్రాంతాలలో శ్రీవారి లడ్డూల లభ్యత కోసం భక్తుల నుండి చాలా డిమాండ్ ఉందని, అయితే అనేక లాజిస్టిక్స్ కారణంగా ఇది ఇప్పటివరకు జరగలేదని ఆయన అన్నారు.

అయితే ప్రస్తుతం తిరుమలలో మధ్య దళారుల బెడదను అరికట్టిన టీటీడీ ఇప్పుడు శ్రీవారి లడ్డూలను నిత్యం ఇతర ప్రాంతాలకు పంపించాలని యోచిస్తోంది అని అన్నారు.