తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్ర చూడ్!

J.SURENDER KUMAR,


భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్శించి శ్రీవేంకటేశ్వరునికి పూజలు చేశారు.

వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద ప్రోటోకాల్ ప్రముఖులకు టిటిడి ఇవో  జె శ్యామలరావు, అదనపు ఇవో  సిహెచ్ వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు.

జస్టిస్ చంద్రచూడ్ తన పరివారంతో కలిసి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయంలోకి ప్రవేశించి గర్భగుడిలో ప్రార్థనలు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో సీజేఐ కుటుంబసభ్యులకు వేదపండితులు వేదపండితులు వేదశీర్వచనం అందించారు.

అనంతరం టీటీడీ ఈవో శ్రీవారి ప్రసాదం, తీర్థప్రసాదాలు అందజేశారు. సీవీఎస్‌వో  శ్రీధర్, డీఈవోలు  లోకనాథం,  భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.