టీపిసిసి సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,


తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమీక్ష సమావేశంలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పాల్గొన్నారు

టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లాల వారిగా గాంధీ భవన్ లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మున్షి, సంబంధిత ఏఐసీసీ ఇంచార్జ్ లు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలోఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పాల్గొని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి పలు అంశాలు వివరించి చర్చించారు.

👉మంత్రిని కలిసిన ఎమ్మెల్యే

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను శనివారం సచివాలయంలో మర్యాద పూర్వకంగా ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కలిశారు.