ఉపాధ్యాయులు దేశాభివృద్ధి నిర్మాతలు శ్రీమతి కాంత కుమారి!

J.SURENDER KUMAR,


తరగతి గదులలో ఉపాధ్యాయులు విద్యార్థులకు నేర్పించే విద్యాబుద్ధులు, దేశభక్తి మతసామరస్యం. తదితర అంశాలు దేశాభివృద్ధిలో కీలకమని ఉపాధ్యాయ దేశాభివృద్ధి నిర్మాతలని, ధర్మపురి ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి కాంత కుమారి అన్నారు.


జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా గురువారం ధర్మపురి పట్టణంలోని న్యూ హరిజనవాడ, పాఠశాల లో ఉపాధ్యాయులు శ్రీమతి కనకతార ( ప్రధానోపాధ్యాయురాలు ) బుగ్గార హరీష్, శ్రీమతి రొట్టె సరిత, శ్రీమతి మ్యాన సునిత ,అంగన్వాడి టీచర్ మాధవిలత లను సన్మానించి అభినందించారు.

అంతకుముందు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా. శ్రీమతి కాంత కుమారి మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమని, దేశ అభివృద్ధి,. ప్రజాస్వామ్య మనుగడ, దేశభక్తి తదితర అంశాలలో ఉపాధ్యాయుల బోధనకు వెలకట్టలేనిదని ఆమె అన్నారు.