👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్!
J.SURENDER KUMAR,
పెగడపల్లి మండలం శాలపెల్లి నుండి అడపపెల్లి, రంగధామునిపల్లె వరద ప్రభావిత గ్రామాలకు వంతెన నిర్మాణం కోసం CRR గ్రాంట్ నుండి ₹ 5 కోట్ల రూపాయలతో నివేదికలను ప్రభుత్వానికి పంపించడం జరిగిందని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
పెగడపెల్లి మండలంలోని లింగపూర్ చెరువును శాలపెల్లి, అడుపపల్లి, రంగదాముని పల్లె మధ్య వాగును బుధవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలసి పరిశీలించారు. ఈ సంధర్బంగా అధికారులకు తగు సూచనలు చేసి ముందస్తుగా చేపడుతున్న చర్యలపైన వివరాల ను తెలుసుకున్నారు.
ఈ సంధర్బంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…
చెరువులలో తూములకు మరమ్మతులు పూర్తి చేస్తామని, మద్దులపల్లి గ్రామానికి చెందిన బ్రిడ్జి నిర్మాణాన్ని కూడా త్వరిత గతిన పూర్తి చేస్తామని, ఎమ్మెల్యే అన్నారు.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెగడపెల్లి మండల లింగాపూర్ గ్రామంలోని చెరువు నిండడంతో చెరువును ఎమ్మెల్యే పరిశీలించారు. అదే విధంగా శాలపెల్లి నుండి అడపపెల్లి, రంగధామునిపల్లె గ్రామాల చుట్టూ కూడా వరద వచ్చి గ్రామాల చుట్టూ నీరు చేరింది. ఈ గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. అధికారులతో మాట్లాడి గ్రామస్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మండలానికి సంబంధించి రోడ్లు వరదల వల్ల కొంత దెబ్బతినడం జరిగిందని వాటిని తాత్కలికంగా మరమత్తులు చేయాలని అధికారులను ఆదేశించారు. భగవంతుని దయ వల్ల ఎక్కడ ఎటువంటి ప్రాణనష్టం ఆస్థి నష్టం జరగలేదని, ఈ మండలానికి సంబంధించి చెరువులు మరియు రోడ్లు, హై లెవెల్ బ్రిడ్జ్ల గురించి కలెక్టర్ కు నివేదిక అందిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు..
ఈ కార్యక్రమంలో అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
👉ప్రభుత్వానికి వివరిస్తాను…

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న పార్ట్ టైం మరియు సీఆర్టి ఉపాధ్యాయులను తొలగించడంతో బుధవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ధర్మపురి లోని వారి క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పందించి ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.