👉సీఎం సహాయ నిధికి విరాళాల వరద !
J.SURENDER KUMAR,
ముఖ్యమంత్రి సహాయ నిధికి వరద బాధితుల కోసం విరాళాల వరదల వస్తున్నాయి. గురువారం ప్రముఖ సంస్థలు బ్యాంకు ఉద్యోగులు ₹ 11 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు.
వరద బాధితులను ఆదుకోవడంలో ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (SBI) ఉద్యోగులు తమ ఉదారతను చాటుకున్నారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా ‘తెలంగాణ ఎస్‌బీఐ ఉద్యోగులు’ తమ ఒక రోజు వేతనం ₹.5 కోట్లు గురువారం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళమిచ్చారు.
జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను ఎస్‌బీఐ ప్రతినిధి బృందం కలిసి, ₹5 కోట్ల విరాళం చెక్కును అందజేశారు.
సీఎం, డిప్యూటీ సీఎంను కలిసినవారిలో ఎస్‌బీఐ సీజీఎం రాజేష్ కుమార్ గారు, డీజీఎం జితేందర్ శర్మ గారు, ఏజీఎంలు దుర్గా ప్రసాద్ గారు, తనుజ్ గారు తదితరులు ఉన్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో ఎస్‌బీఐ ఉద్యోగులు చూపిన ఔదార్యాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు.
👉అరబిందో ఫార్మా సంస్థ ₹ 5 కోట్లు.!

వరద బాధితుల సహాయార్థం ప్రఖ్యాత అరబిందో ఫార్మా సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹ 5 కోట్లు విరాళం ఇచ్చింది. జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్కను సంస్థ ప్రతినిధులు కలిసి, విరాళం చెక్కును అందజేశారు.
సీఎం, డిప్యూటీ సీఎంలను కలిసినవారిలో అరబిందో ఫార్మా వైస్ ప్రెసిడెంట్ నిత్యానంద రెడ్డి , డైరెక్టర్ మదన్ మోహన్ రెడ్డి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఐఎస్ఆర్ రావు ఉన్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో అరబిందో ఫార్మా సంస్థ చూపిన ఔదార్యాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు.
👉ఏఐజీ హాస్పిటల్స్ ₹ కోటి రూపాయలు!

వరద బాధితుల సహాయార్థం ప్రఖ్యాత ఏఐజీ హాస్పిటల్స్ (AIG Hospitals) యాజమాన్యం ముఖ్యమంత్రి సహాయ నిధికి ,₹.1 కోటి విరాళం ఇచ్చారు. జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ను కలిసి ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి , వైస్ చైర్మన్ పీవీఎస్ రాజు విరాళం చెక్కును అందజేశారు.