👉కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ప్రమోషన్లకు, పదవి విరమణలకు సీఎం రేవంత్ రెడ్డి అవకాశం కల్పించారు
J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం రోజున నిర్వహించిన జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు మరియు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి పురస్కారాలను అందజేశారు.
👉ఈ సంధర్బంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..

ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకున్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు నా పక్షాన ప్రభుత్వ పక్షాన శుభాకాంక్షలు అన్నారు. అన్ని దానాల్లో కన్నా విద్య దానం గొప్పదని, విద్యారంగంలో జగిత్యాల జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలనీ, విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల పైన ఆధారపడి ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ప్రమోషన్లకు,పదవి విరమనలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవకాశం ఇచ్చినట్టు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఇందులో భాగంగా జిల్లాకు చెందిన 110 మంది హెడ్ మాస్టర్లకు,739 మంది స్కూల్ టీచర్లకు పదోన్నతులు కల్పించడం జరిగిందని, కేవలం విద్య రంగానికే ₹ 15వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగిందన్నారు.

అమ్మ ఆదర్శ పాఠశాల కింద విద్యార్థులకు యూనిఫామ్స్, టెస్ట్ బుక్స్ అందించడం జరుగుతుందనీ, దాదాపు జిల్లా కు అమ్మ ఆదర్శ పాఠశాలల కింద ₹ 34 కోట్ల రూపాయల అంచనాలు రూపొందిస్తే అందులో ₹ 20 కోట్ల రూపాయలు వ్యయం చేసినట్టు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం జరుగుతుందని, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సంధర్బంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు.