J.SURENDER KUMAR,
ధర్మపురి పవిత్ర గోదావరి నదిలో బుధవారం జరిగిన వినాయక నిమజ్జనం కార్యక్రమంలో ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

వినాయక చవితి సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే వినాయకుడిని నిమజ్జనం చేయడానికి గోదావరి నదికి కాంగ్రెస్ శ్రేణులతో వచ్చారు. నది తీరంలో వినాయకుడికి వేద పండితుడు పాలెపు ప్రవీణ్ శాస్త్రి ప్రత్యేక పూజలు అనంతరం గోదావరి నదిలో నిమజ్జనం చేశారు.
👉కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టాలి !

వినాయక నిమజ్జనం సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టాలని గోదావరిలో జరుగుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. పోలీస్, మున్సిపల్, రెవెన్యూ అధికారులతో మాట్లాడారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుకోవాలని, క్రేన్లు, లైటింగ్ ను ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవలని, ప్రజలు భక్తి శ్రద్దలతో వినాయక నిమజ్జనం నిర్వహించుకోవాలని ఈ సందర్బంగా తెలిపారు..

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు