J.SURENDER KUMAR,
వినాయక చతుర్థి పర్వదినం సందర్భంగా శనివారం ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తన క్యాంపు కార్యాలయంలో సాయంత్రం వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ పార్టి శ్రేణులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ గణనాథుడు ధర్మపురి ప్రాంత ప్రజలకు తాను ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చే విధంగా ఆశీస్సులు అందించాలని, ధర్మపురి ప్రాంత ప్రజలను ఆయురారోగ్యాలతో ఎల్లవేళలా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు