👉సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్!
J.SURENDER KUMAR,
ఎల్లంపల్లి నిర్వాసితులకు పరిహారాన్ని మంజూరు చేసిన సిఎం రేవంత్ రెడ్డి కి, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
వెల్గటూర్ మండలం ముక్కట్రావు పేటకు, చెందిన ఎల్లంపల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు ప్రభుత్వం నుండి మంజూరు అయిన ₹ 52 లక్షల విలువ గల 24 పరిహార చెక్కులను జగిత్యాల RDO మధుసూదన్ తో కలిసి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ బుధవారం లబ్దిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులైన ముక్కట్రావు పేట గ్రామనికి చెందిన 24 మంది కుటుంబాలకు ప్రభుత్వం నుండి మంజూరు అయినా పరిహారం చెక్కులను పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని, పరిహారం అందని వారు బాధ పడాల్సిన అవసరం లేదనీ మిగిలిన వారికి కూడా త్వరలోనే పరిహారం అదే విధంగా చర్యలు తీసుకుంటామని, అదే విధంగా చేగ్యం గ్రామానికి చెందిన 126 భూ నిర్వాసితుల కుటుంబాలకు చెందిన ₹ 18 కోట్ల రూపాయలను కూడా మంజూరు చేయాలనీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను, మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్ళి అట్టి డబ్బులను కూడా మంజూరు చేయించడం జరిగిందని, వాటిని త్వరలోనే నిర్వాసితులకు పంపిణీ చేస్తామని, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు.

గత పది సంవత్సరాలు గా ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వాసితులను పట్టించుకోని బిఆర్ఎస్ నాయకులు పని కట్టుకుని మాపైన బురద జల్లే ప్రయత్నం చేయడం జరుగుతుందని, ప్రజలు వారి మాటల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని, మీ ప్రతి కష్టం ముందు నేను నిలబడి ఉంటానని, ఎవరికి ఎటువంటి అవసరం ఉన్న నన్ను నేరుగా కలవవచ్చని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు