👉రేవంత్ రెడ్డి ప్రభుత్వం 4 నెలలలో పాలకవర్గ ఏర్పాటుకు జీవో జారీ !
👉ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ జోక్యంతో..
J.SURENDER KUMAR,
రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాలుగు నెలల్లోనే ఆలయాల పాలకవర్గ ఏర్పాటుకు జీవో జారీ చేసింది. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొరవతో ఐదు సంవత్సరాల తర్వాత ప్రత్యేకంగా ధర్మపురి ఆలయంతోపాటు రాష్ట్రంలో 25 ప్రముఖ ఆలయాలకు పాలకవర్గ లు ఏర్పాటు కానున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుతీరి దాదాపు 9 నెలలు పూర్తికావస్తున్న, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మార్చ్ 2024 నుంచి జూన్ 2024 వరకు దాదాపు 3 నెలల పాటు ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయలేకపోయింది.
👉వివరాల్లోకి వెళితే.
రాష్ట్రంలో ప్రముఖ 26 ఆలయాలకు ప్రభుత్వం పాలకవర్గ లు ఏర్పాటు కోసం ప్రభుత్వ కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారిని రామ శైలజ అయ్యంగార్, ఆగస్టు 23, 2024, న G.ORt. No 229 . పాలకవర్గ ఏర్పాటుకు జీవో జారీ చేశారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒకటి. వరంగల్ జిల్లాలో 8, నల్గొండ జిల్లాలో 8 మహబూబ్ నగర్ జిల్లాలో 4. రంగారెడ్డి జిల్లాలో 2 సికింద్రాబాద్ పరిధిలో 3 . ఆలయాల పాలకవర్గ ఏర్పాటుకు ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు 26 ఆలయాల అధికారులు ప్రకటన జారీ చేయాల్సిందిగా వారికి ఆదేశాలు జారీ చేశారు.
👉ధర్మపురి ఆలయానికి..5 సంవత్సరాల తరువాత..

బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధర్మపురి ఆలయ అభివృద్ధికి ₹ 100 కోట్ల నిధుల వరద అంటూ ప్రకటనలకే పరిమితం తప్ప, ఆచరణలో అగుపించలేదనేది జగమెరిగిన సత్యం. 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో. సంవత్సర కాలపరిమితి కి పాలకవర్గం 2017 మే నుంచి 2018 జనవరి వరకు, 2018 జూలై నుంచి 2019 జూలై మాసం వరకే ఒకే పాలకవర్గం రెండు పర్యాయములు నియమించారు.
👉జీవో వచ్చిన ప్రకటన జారీ చేయలేదు !

ధర్మపురి ఆలయ పాలకవర్గ ఏర్పాటుకు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వ కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్, మెమో నెంబర్ 46049/.. తేదీ 14/12/2022 న పాలకవర్గ ఏర్పాటుకు ప్రకటన జారీ చేయాల్సిందిగా ధరంపురి ఆలయ అధికారులకు ఆదేశాలు జారీచేసినా ,నాటి ఓ నాయకుడి రాజకీయ ఒత్తిడి నేపథ్యంలో స్థానిక ఆలయ అధికారులు ప్రకటన జారీ చేయలేదు.
పాలకవర్గ పదవుల ఆశించిన నాటి బీఆర్ఎస్ చోట మోటా నాయకులు.2023 అసెంబ్లీ ఎన్నికలలో పాలకవర్గ ఏర్పాట్లు అడ్డుకున్న ఆ నాయకుడే ప్రచారం చేస్తాడు, అతడే పార్టీకి ఓట్లు వేస్తాడంటూ కొందరు బహిరంగంగా నాయకులను నిలదీశారు.
👉ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్ కంట పడాలని తహతహ..

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని, కాలుకు బలపం కట్టుకొని ప్రచారం చేసిన కొందరు, త్వరలో ఏర్పాట కానున్న ఆలయ పాలకవర్గంలో ధర్మకర్తల పదవుల కోసం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, కంట పడడానికి చిత్ర, విచిత్ర విన్యాసాలు చేస్తూ. అన్న ఇలా చేయాలి, అన్నా అలా చేయాలి, మీతోనే ఆలయం అభివృద్ధి జరుగుతుంది. అంటూ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యానాలు. విన్యాసాలు, వారి ప్రవర్తన తీరును కాంగ్రెస్ శ్రేణులను విస్మయానికి గురి చేస్తున్నది. వారి విన్యాసాలు విఫలం అవుతాయా ? సఫలం అవుతాయా ?
వేచి చూడాల్సిందే !