J.SURENDER KUMAR,
నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పన సాగు తాగు నీరు విద్యా, వైద్యం తదితరు అభివృద్ధి కార్యక్రమాలకు రాజకీయాలకతీతంగా ప్రజలు సహకరించాలని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ఎండపెల్లి మండలం జగదేవ్ పేట గ్రామ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ను యువజన సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు.

గ్రామానికి చెందిన యువకులు, వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…

జగదేవ్ పేట గ్రామ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నాపై ప్రేమ అభిమానాలతో నన్ను ఆహ్వానించి ఘనంగా సన్మానించిన అంబేద్కర్ సంఘ సభ్యులకు గ్రామ ప్రజలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం లోనే పెద ప్రజలకు మేలు జరుగుతుందని భావించి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన యువకులు, గ్రామస్థులకు స్వాగతం పలుకుతున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుందని, హామీ ఇచ్చిన ఆరు గ్యారేంటిలలో భాగంగా ₹ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్,₹ 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిధిని 10 లక్షలకు పెంపు,రైతులకు ₹ 2 లక్షల వరకు రుణమాఫీ, ప్రతి ఏటా రైతు భరోసా, సన్న వడ్లకు ₹ 500 రూపాయల బోనస్ వంటి ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసి చూపడం జరిగిందని, నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు. చేశామని ఎమ్మెల్యే అన్నారు.
ఎవరికి ఎటువంటి అవసరం ఉన్న నేరుగా వచ్చి నన్ను కలవచ్చని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.