తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన గురువారం తిరుమలలోని నాద నీరాజనం, ఆస్థాన మండపంలో టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన ధార్మిక, సంగీత కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరించాయి.
తిరుమల నాద నీరాజనం వేదికపై ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాలకు చెందిన శ్రీమతి లక్ష్మీ సువర్ణ, సీ.హెచ్.మల్లేశ్వర రావ్, బి.చంద్ర శేఖర్, బి.అశోక్ బృందం మంగళ ధ్వని, ఉదయం 5:30 నుండి 6:30 గంటల బెంగుళూరుకు చెందిన బ్రహ్మశ్రీ హరి సీతారామమూర్తి, సలక్షణ ఘనాపాఠిలు “భాగ్య సూక్తం-సామాజిక సందేశం” అనే అంశంపై ఉపన్యసించారు. తర్వాత సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు హైదరాబాదుకు చెందిన నంది పురస్కార గ్రహీత కె.రామాచార్య బృందం అన్నమయ్య సంకీర్తనలను ఆలపించారు.

ఆస్థాన మండపంలో ఉదయం 7 నుండి 8 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి ప్రసన్న లక్ష్మీ బృందం ” విష్ణు సహస్రనామ పారాయణం” ఉదయం 10 నుండి 11:30 గంటల వరకు హైదరాబాద్ కు చెందిన ఓ.ఎల్.ఎన్ రెడ్డి బృందం భక్తి సంగీతం, ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తిరుపతికి చెందిన గౌరిపెద్ది శంకర్ భగవాన్ భక్తి సందేశం అనే అంశంపై ఉపన్యసించారు. అనంతరం సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు తిరుపతికి చెందిన కె.సుబ్రమణ్యం, శ్రీమతి టి.లీలాకుమారి బృందం అన్నమాచార్య సంకీర్తనలను సుమధురంగా ఆలపించారు. సాయంత్రం 5:30 నుండి రాత్రి 7 గంటల వరకుమదనపల్లెకు చెందిన శ్రీమతిఎ.శారద బృందం హరికథ కార్యక్రమం నిర్వహించారు.
👉మహతీ కళాక్షేత్రంలో అలరించిన భరతనాట్యం కూచిపూడి,!
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం మహతీ కళాక్షేత్రం, శ్రీరామచంద్ర పుష్కరిణి, అన్నమాచార్య కళామందిరంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన భక్తిశ్రద్ధలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు డెనిజనులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల డ్యాన్స్ లెక్చరర్ సి.హరినాథ్ ప్రదర్శించిన భరతనాట్యం, కూచిపూడి ప్రేక్షకులను అలరించారు. అనంతరం అన్నమాచార్య కళా మందిరంలో ముంబయికి చెందిన శ్రీమతి వరలక్ష్మి చేసిన భక్తి సంగీత ప్రదర్శన భక్తులను అలరించింది.
శ్రీరామచంద్ర పుష్కరణిలో మురళీకృష్ణ బృందంచే నిర్వహించిన భక్తి సంగీత కార్యక్రమం సభికులను అలరించింది.