అంగరంగ వైభవంగా గణపతి అభిషేకం !

J.SURENDER KUMAR,


కొత్తపేట హైదరాబాద్ కొత్తపేట లోని ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం లో ఆదివారం 55 వగణపతి అథర్వ శీర్ష సహస్ర అభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది.


ఉదయం నుండి పట్టణ నలు మూలాల నుంచి వంద మంది బ్రాహ్మణుల సహాయంతో రఘు కిషోర్ , వైదిక నిర్వహణ లో అత్యంత అద్భుతంగా అభిషేకం జరిగినది. ఈ కార్యక్రమానికి ఆలయ అధికారులు సిబ్బంది వేద పండితులు శ్రీనివాస్ నేతృత్వంలో సంపూర్ణం గా సహకరించారు .

అభిషేక కార్యక్రమంలో డాక్టర్ యజ్ఞం పవన్ కుమార్, సైంటిస్ట్ దేవీప్రసాద్ , చీరాల శ్రీధర శర్మ, ప్రసాద్, శ్రీనివాస్, గోపాల్, హేమా దుర్గా తదితరులు పాల్గొన్నారు.
గాయత్రి జప యజ్ఞం గూర్చి, శేషు రఘు, పవన్ ప్రసాద్ లు ఈ సందర్భంగా మాట్లాడారు.


ఈ కార్యక్రమానికి సహకరించిన విజయవంతం చేసినందుకు అభిషేక సమన్వయ కర్త వినోద్ కుమార్ మహావాది ధన్యవాదాలు తెలిపారు.