అంగరంగ వైభవంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు!

👉410 మంది కళాకారుల తో  సాంస్కృతిక కార్యక్రమాలు!

J.SURENDER KUMAR,

తిరుమలలో జరుగుతున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు శుక్రవారం సాయంత్రం పెద్ద శేషవాహన సేవలో కళాకారుల ప్రదర్శన భక్తులను ఉర్రూతలూగించింది.

ఒడిశా, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 410 మంది కళాకారులతో కూడిన మొత్తం 14 బృందాలు తమ కళలను ప్రదర్శించాయి.

మయూర నృత్యం, యక్ష గానం, కోలాటం, ఒగ్గు డోలు వంటివి అనేకం. సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించిన భక్తజనం పరవశులయ్యారు.