అంగరంగ వైభవంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు !

👉500 మంది కళాకారులతో సాంస్కృతిక కళా ప్రదర్శన !


J.SURENDER KUMAR,


తిరుమల శ్రీవారి సన్నిధిలో అంగరంగ వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. పలు రాష్ట్రాలకు చెందిన కళాకారులు శ్రీవారి వాహన సేవల్లో పాల్గొని తమ కళా ప్రదర్శనలతో భక్తజనం ను మంత్రముగ్ధులను చేశారు.


ఆదివారం సాయంత్రం ముత్యాల పందిరి వాహన సేవ ఎదుట మొత్తం 20 కళాబృందాలు, 541 మంది కళాకారులు తమ కళారూపాలను ప్రదర్శించారు.


శ్రీకృష్ణావతార రూపకం, దశావతార మహోత్సవం, శ్రీ నరసింహోద్భవ ఘట్టంతో పాటు పలు కళారూపాలు భక్తులను ఆకట్టుకున్నాయి.