J.SURENDER KUMAR,
మహాత్మా గాంధి జయంతి సందర్భంగా, బుధవారం రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో గల గాంధీ జి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి వేడుకలు నిర్వహించారు.
హర్యాన రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ, మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ లతో కలిసి ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, తదితర ప్రజా ప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

👉గవర్నర్ ను కలిసిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్!

హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ ను హైదరాబాద్ లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.

ఈ సందర్భంగా గవర్నర్ దత్తాత్రేయ రాష్ట్రంలో శ్రీకారం చుట్టిన ‘అలాయ్ , బలాయ్ ‘ కార్యక్రమం కులమాతాలకతీతంగా, మతసామరస్యానికి ప్రత్యక్ష నిదర్శనంగా సమాజంలో ఎనలేని గుర్తింపు పొందడంతో పాటు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ , తదితర ప్రజాప్రతినిధులు గవర్నర్ దత్తాత్రేయ ఈ సందర్భంగా అభినందించారు.