J.SURENDER KUMAR,
బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని,బతుకమ్మ ఉత్సవాల నిర్వహణలో అధికారులు సమన్వయంతో పనిచేయాలనీ ధర్మపురి ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ఎండపెల్లి మండలం రాజారాం పల్లె లోని స్థానిక SR గార్డెన్స్ లో మంగళవారం నియోజకవర్గ స్థాయి అధికారులు తో బతుకమ్మ సంబరాలపైన ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా RDO మరియు మండల స్థాయి తహసిల్దార్లు, ఎంపీడీవోలు, పంచాయితీ సెక్రటరీలతో బతుకమ్మ ఉత్సవాల నిర్వహణ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…
మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, బతుకమ్మ ఘాట్ల వద్ద లైటింగ్,మంచినీటి సదుపాయం,టెయిలెట్లు వంటి ఏర్పాట్లను పూర్తి చేయాలనీ ఈ సందర్భంగా తెలిపారు..
ఈ కార్యక్రమంలో అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు