బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !



J.SURENDER KUMAR,


గోదావరి నది తీరంలో గురువారం జరగనున్న  సద్దుల బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లు ను ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం పరిశీలించారు.


గోదావరి వద్ద గల మంగళి గడ్డ మరియు శమీ పూజను నిర్వహించే జంబి గద్దెను రెవెన్యూ,nమున్సిపల్,మ్,.పోలీస్ అధికారులు మరియు మండల నాయకులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఏర్పాట్లకు సంబంధించిన పలు విషయాలను అధికారులను అడిగి తెలుసుకొని తగు సూచనలు చేశారు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.


👉ప్రారంభోత్సవం..
ధర్మారం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ షాప్ ను ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.
👉వెల్గటూర్ మండలంలో..
దేవి నవరాత్రుల సందర్భం చెర్లపెల్లి , కొండపూర్ గ్రామాలలో ఏర్పాటు చేసిన పలు అమ్మవార్లను  ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్   దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.