బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన!

J.SURENDER KUMAR,


కాంగ్రెస్ రైతు భరోసా ఎగవేతపై బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ధర్మపురి పట్టణంలో నిరసన మరియు ధర్నా చేపట్టారు.


ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ..


గత డిసెంబర్ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులతో పాటు అన్ని వర్గాలను నయవంచన చేసిందని, ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చకుండా మాటలు గారడితో గత ప్రభుత్వాన్ని కేసీఆర్ ని తిట్టడమే కార్యక్రమంగా పెట్టుకున్నదని విమర్శించారు.


ఈ కార్యక్రమంలో , మాజీ జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ హరి చరణ్ రావు, మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఆయ్యోరి రాజేష్, ధర్మపురి సింగిల్ విండో చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఆకుల రాజేష్, మరియు బిఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..