సీఎం సహాయ నిధికి కోటి రూపాయల విరాళం!

J.SURENDER KUMAR,


వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ₹ 1,01,75,000 విరాళం అందించింది. అసోసియేషన్ ప్రతినిధులు ఎస్.నర్సింహారెడ్డి , యు.సురేందర్ తో పాటు ఇతర ముఖ్యులు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి ఈ మేరకు చెక్కును అందించారు.

వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అండగా విరాళం అందించినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  వారిని అభినందించారు.


👉విన్స్ బయో ప్రోడక్ట్స్ ,₹  51 లక్షలు !


వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి విన్స్ బయో ప్రోడక్ట్స్ (VinsBioproducts) ₹ 51 లక్షల రూపాయలు విరాళం అందించింది. సంస్థ చైర్మన్ శ్రీదాస్ నారాయణ దాస్ డాగ , కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ డాగ  జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి ఈ మేరకు చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అండగా విరాళం అందించినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  వారిని అభినందించారు.


👉ఆపరేటివ్ సొసైటీ ₹ 10 లక్షలు.!


వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి ది సిటిజన్ కో-ఆపరేటివ్ సొసైటీ 10 లక్షల రూపాయల  విరాళం అందించింది. సొసైటీ మేనేజింగ్ డైరెక్టర్ కె.వెంకట సుబ్బయ్య , డైరెక్టర్ ఎ.సోమలింగం గౌడ్  జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి చెక్కును అందించారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించారు.


👉బొండాడ గ్రూపు ₹ 25 లక్షల !


వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి బొండాడ గ్రూపు ₹ 25 లక్షల రూపాయల విరాళం అందించింది. Bondada Group చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బొండాడ రాఘవేంద్రరావు  ఇతర ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి ఈ మేరకు చెక్కును అందించారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అండగా విరాళం అందించినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  వారిని అభినందించారు.


👉భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ₹ 25 లక్షలు!


వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (Bhagyanagargaslimited-BGL) ₹ 25 లక్షల రూపాయల విరాళం అందించింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి రామ్ మోహన్ రావు గ పలువురు ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి ఈ మేరకు చెక్కును అందించారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అండగా నిలిచినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  వారిని అభినందించారు.