కలెక్టర్ అధ్యక్షతన L R S దరఖాస్తుల పై సమీక్ష !

J.SURENDER KUMAR


జగిత్యాల జిల్లాలో పెండింగ్ లో ఉన్న LRS దరఖాస్తుల పై గురువారం కలెక్టర్ బి సత్య ప్రసాద్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
కలెక్టరేట్ సమావేశం మందిరంలో LRS పెండింగ్ దరఖాస్తులకు టౌన్ ప్లానింగ్, మున్సిపల్ రెవిన్యూ ఇరిగేషన్, ఎంపీడీవో అధికారులతో సమీక్షించారు.


ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
అదనపు లాగిన్ల ఎప్పటికప్పుడు పూర్తిచేయాలని అలాగే L.1 . ఆఫీసర్లు ప్రతిరోజు 40 దరఖాస్తులను పూర్తి చేయాలని తెలిపారు. వార్డు ఆఫీసర్లకు అడిషనల్ లాగిన్ చేయించాలని వారికి ట్రైనింగ్ ఇవ్వాలని ఆదేశించారు. ప్రతిరోజు ఎన్ని దరఖాస్తులు చేస్తున్నారు.


ప్రతి అధికారి ద్వారా 40 దరఖాస్తు లు ప్రాసెస్ చేయాలని చూసించారు.
రోజు వారి దరఖాస్తు వివరాలను డాష్ బోర్డ్ పొందుపరచాలని, కలెక్టర్ ఆదేశించారు.
రోజువారీ పురోగతిని పర్యవేక్షించడానికి పురోగతిని పర్యవేక్షించడానికి మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు.

శిఖం భూముల్లో, వక్ఫ్ భూములు, కమర్షియల్
పబ్లిక్ ల్యాండ్ జోన్ దరఖాస్తులను ఎప్పటికప్పుడు క్లియర్ చేయమని అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో, అదనపు కలెక్టర్ గౌతంరెడ్డి, మున్సిపల్, రెవెన్యూ, ఎంపీడీవోలు , ఎంపీ ఓ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.